Posts

Showing posts from October, 2026

నారాయణవనంలో కళ్యాణవేంకటేశ్వర స్వామి ఆలయం

Image
  తిరుమల తిరుపతి యాత్రలో తప్పక చూడాల్సిన క్షేత్రం నారాయణవనం. శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవేరి పద్మావతీదేవి పుట్టిన ఊరు నారాయణవనం. ప్రాచీనకాలంలో నారాయణవనాన్ని రాజధానిగా చేసుకొని ఆకాశరాజు ఈ ప్రాంతాలను పాలిస్తుండేవాడు. ఆయన ఒక యాగాన్ని చేయడం కోసం పొలాన్ని సన్నద్దం చేస్తున్న సమయంలో అక్కడ ఒక శిశువు దొరికింది. ఆమెకు పద్మావతి అని పేరు పెట్టి ప్రేమగా పెంచుకున్నాడు ఆకాశరాజు. ఆమె యుక్తవయసుకు చేరేసరికి ఆమె రూపం దేవకన్యలను మించింది. తిరుమల గిరుల్లో నివాసం ఉంటున్న శ్రీనివాసుడు ఒక మదపుటేనుగును వేటాడుతూ నారాయణవనం అడవుల్లోకి ప్రవేశించి రాజుగారి వనంలో చెలికత్తెలతో విహరిస్తున్న పద్మావతిని చూసి మోహించాడు. ఆమెను వివాహం చేసుకోవడానికి శ్రీనివాసుడు తన తల్లి వకుళమాతతో కలసి చేసిన చిలిపి రాయబారాలు ఎంతో పసందుగా ఉంటాయి. చివరకు ఆకాశరాజు దంపతులను ఒప్పించి పద్మావతీదేవిని పెళ్ళి చేసుకున్నాడు శ్రీనివాసుడు. శ్రీనివాస పద్మా‍వతీ కళ్యాణం జరిగింది నారాయణవనంలోనే. అందుకే స్వామివారు నారాయణవనంలో కళ్యాణవేంకటేశ్వరునిగా వెలిశాడు. పద్మావతీదేవి ఆలయం కూడా నారాయణవనంలో ఉంది. ఆ విధంగా శ్రీవేంకటేశ్వరస్వామి, పద్మావతీదేవి పాదస్పర్శతో ప...